నేటి నుంచి హెచ్ 1-బీ వీసా దరఖాస్తులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు వలస చట్టంలో వివాదాస్పద సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మొదటిసారి హెచ్-1బీ వీసాల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి యూఎస్ పౌరసత్వ, వలస సేవల విభాగం (యుఎస్సీఐఎస్) దరఖాస్తులను స్వీకరించనుంది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 65,000 మందికి హెచ్1-బీ ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితో పాటు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మరో 20,000 మంది విదేశీయులకు అవకాశాన్ని కల్పించనుంది. దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియ అక్టోబరు 1న ప్రారంభం కానుంది. ఈ ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుంది. ఒక అభ్యర్థి నుంచి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే వాటిని తిరస్కరిస్తాం అని యూఎస్సీఐఎస్ వెల్లడించింది.













