కాలిఫోర్నియా-నెవడా సరిహద్దులో ప్రమాదం
నైజీరియాలోని అతిపెద్ద బ్యాంకైన యాక్సెస్ బ్యాంకు సీఈవో హెర్బర్ట్ విగ్వే అమెరికాలో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దాదాపు 3 వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలడంతో అందులో ప్రయాణిస్తున్న హెర్బర్ట్ సహా ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియా-నెవడా సరిహద్దుల్లోని మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. యాక్సెస్ బ్యాంకు సీఈవో హెర్బర్ట్ విగ్వే, ఆయన భార్య, కుమారుడితో పాటు నైజీరియాకు చెందిన ఎన్జీఎక్స్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా, ఇద్దరు పైలట్లు మరణించినట్లు ఈ ప్రమాదంలో అధికారులు తెలిపారు.







