TANA: తానా మహాసభలకు వస్తున్న తారలు…
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, ఇండియాలో ఉన్న రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు, ఇతరులు మహాసభలకు వచ్చి కనువిందు చేస్తుంటారు. ఈసారి మహాసభలకు సినీరంగం నుంచి పలువురు హీరోలు, హీరోయిన్‌లు, సంగీత దర్శకులు, నేపథ్యగాయనీ గాయకులు వస్తున్నారు. వీరితోపాటు యాంకర్లు ఇతర చిన్న, పెద్ద తారలంతా తరలి వస్తున్నారు.
టాలీవుడ్ లో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ తో పాటు హీరో నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, గాయనీ గాయకులు చిత్ర, సునీత, ఎస్.పి.బి. చరణ్, శ్రీకృష్ణ, సింహతోపాటు గాయని శ్రీమతి శోభారాజు, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. వీరితోపాటు ఇతర ప్రముఖులు కూడా వచ్చే ఈ మహాసభలకు అందరూ రావాలని కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు.
రిజిస్ట్రేషన్ ఆఫర్…
జూన్ 8వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకుంచే ఒక టిక్కెట్ కు ఇంకో టిక్కెట్ ఫ్రీగా ఇస్తున్నట్లు తానా మహాసభల కో ఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ ఆఫర్ కావాలనుకున్నవారు పోస్టర్ లో చూపిన విధంగా కోడ్ ను ఉపయోగించుకుని పొందవచ్చు. జూలై 4, 5వ తేదీ వరకు సాధారణ రిజిస్ట్రేషన్ లు జరుగుతుంటాయి. బోగో ఆఫర్ మాత్రం జూన్ 8వరకు మాత్రమే ఉంది. వెంటనే మీరు మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫర్ ను ఉపయోగించుకోండి. ఇతర వివరాలకు కాన్ఫరెన్స్ వెబ్ సైట్ ను చూడండి.
కాన్ఫరెన్స్ వెబ్ సైట్ tanaconference.org
కాన్ఫరెన్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
Register now: https://tanaconference.org/event-registration.html







