ఆటా లో సినీ సందడి
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభల్లో సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో నిర్వహించనున్నారు. ఈ మహాసభలకోసం పలువురు సినీ కళాకారులు కూడా తరలి వస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, హీరోయిన్లు నేహా శెట్టి, జాహ్నవి కపూర్, మెహ్రీన్, ఖుషీ కపూర్, రోహిణి, గౌరీ ప్రియ అశ్వినీ, దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి తదితరులు రానున్నారు. వీరితోపాటు పలువురిని కూడా ఆటా నాయకులు ఆహ్వానించారు.







