TLCA: టీఎల్‌సీఏ, లాంగ్ ఐలాండ్ వర్సిటీ ఆధ్వర్యంలో యూత్ కాన్ఫరెన్స్

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA), లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ (LIU) సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 తేదీన యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓల్డ్ వెస్ట్‌బరీలోని ఎల్‌ఐయూ (LIU) పోస్ట్‌లో జరగనుంది. “పవర్ ఆఫ్ యూత్ షేపింగ్ ది ఫ్యూయర్” అనే శీర్షికతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో (Youth Conference) పాల్గొన్న వారికి టీఎల్‌సీఏ (TLCA), లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ (LIU) తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. 11-21 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులంతా ఈ సదస్సులో పాల్గొనవచ్చు. ఇందులో విద్యాపరమైన, వ్యక్తిగత అభివృద్ధికి కీలకమైన అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు ఉంటాయి.
హైస్కూల్ విద్యార్థుల కోసం SAT/ACT పరీక్షల తయారీ, కళాశాల దరఖాస్తులు, కృత్రిమ మేధస్సు (AI)పై సెషన్లు ఉంటాయి. అదేవిధంగా, మిడిల్ స్కూల్ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, హైస్కూల్‌కు మారడంపై జరిగే వర్క్‌షాప్‌లు జరగనున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఆరోగ్యం & వెల్‌నెస్‌పై సెషన్ నిర్వహించనున్నారు. ఈ సదస్సు (Youth Conference) కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రవేశం ఉచితం. దరఖాస్తు చేసుకోవడానికి https://tinyurl.com/TLCAYOUTHCONF2025 లింక్‌ను ఉపయోగించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ మధ్యాహ్న భోజనం కూడా అందజేస్తారు.