TLCA: ఘనంగా టీఎల్ సిఎ వనోత్సవం…కృష్ణాష్టమీ వేడుకల

న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీన హిక్స్ విల్లేలోని కాంటిగ్ పార్క్ లో వనోత్సవం, కృష్ణాష్టమీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టిఎల్ సిఎ నాయకులు, సభ్యులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అందరూ కుటుంబ సమేతంగా ఈ వేడుకల వచ్చి ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి తెలిపారు. కృష్ణాష్టమీని పురస్కరించుకుని చేసిన కార్యక్రమాల్లో పలువురు చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. బాలకృష్ణుని, గోపికల వేషధారణలో పలువురు చిన్నారులు మెప్పించారు. మహిళలకోసం గోరింటాకు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు, పెద్దలకు ఆటలపోటీలను నిర్వహించి పలువురికి బహుమతులను కూడా అందజేశారు. మద్దిపట్ల ఫౌండేషన్ వారు రాఫెల్స్ నిర్వహించగా, వల్లెంవారిఫామ్స్ (వివిఎఫ్) ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించింది.
మాజీ అధ్యక్షులు ఉదయ్‌కుమార్ దొమ్మరాజు, నెహ్రు కటారు, సత్య చల్లపల్లి, జయప్రకాశ్ ఇంజపురి, ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు. అలాగే ఇసి టీమ్ సభ్యులు సెక్రటరీ శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ సెక్రటరీ భగవాన్ నడిరపల్లి, జాయింట్ ట్రెజరర్ లావణ్య అట్లూరి, సునీల్ చల్లగుల్ల, దివ్యదొమ్మరాజు, ప్రవీణ్ కరణం, సుధ మన్నవ, సునీత పోలెపల్లె, శిరీష తూనుగుంట్ల, మాజీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి పర్వతాల తదితరులు కూడా ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. బోర్డ్ సభ్యులు డా. మోహన్ బడే, తిరుమలరావు తిపిర్నేని, డా. పూర్ణ అట్లూరి, రాజి కుంచెం, నరేందర్ గుప్తా, ముత్యాల వెంకటేశ్, నెహ్రు చెరుకుపల్లి, కృష్ణారెడ్డి గుజవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వలంటీర్లు శ్రవీణ్, దిలీప్, రామ్, మాధవ్ రెడ్డి, ఇతర మిత్రులు ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, సభ్యులు, పెద్దలకు అందరికీ అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి ధన్యవాదాలు తెలియజేశారు.