TLCA: ఆదరించిన అంతర్జాతీయ ఉగాది తెలుగు కథకులకు కృతజ్ఞతలు!
తెలుగుభాష మన బంధం..సాహిత్యం మన అనుబంధం.
TLCA మొదటిసారి ప్రయోగాత్మకంగా సంస్థను అంతర్జాతీయoగా ఉన్నతెలుగు వారందరికీ పరిచయం చెయ్యాలన్నతలంపుతో ఈ అంతర్జాతీయ ఉగాది కథల పోటీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉదయిని పత్రిక, హైదరరాబాదు వారు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించారు. వారి స్నేహ పూర్వక సహకారంతో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఉగాది కథల పోటీలకు ఊహించని స్పందన వచ్చింది.
ఈ పోటీలకు మొత్తం 247 కథలు వచ్చాయి. ఇంతమంది కథకులకు మన TLCA సంస్థ దగ్గరయ్యింది. ఈ పోటీలను ఆహ్వానించి ఆదరించిన రచయితందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన న్యూయార్క్ మరియు ఇతర రాష్ట్రాలనుండి కూడా ఈ ఉగాది కథల పోటీలకు కథలు పంపిoచారు. నిజానికి మన లోకల్ గా నివసిస్తున్న తెలుగు రచయితలను మంచి రచనలకు ప్రోత్సహించాలనేదే మా మరోముఖ్య ఉద్దేశ్యం. వారుకూడా ఉత్సాహంగా పాల్గొని కథలు పంపించారు. విజేతలను ఎంపికచేసిన న్యాయనిర్ణేతలకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఇలాగే ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ ఉగాది కథల పోటీల నిర్వహణ TLCA కొనసాగిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ముందుగానే చెప్పినట్టు ఈ కార్యక్రమo ద్వారా అంతర్జాతీయంగా తెలుగు వారందరికీ
TLCA సంస్థను పరిచయం చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిభతో, తక్కువ సమయంలో చక్కగా నిర్వహించిన ఉదయిని పత్రిక సంపాదకులు, వ్యవస్థాపకులు శ్రీ కుమార్ కూనపరాజు గారికి, అలాగే ఈ ఆలోచనను పంచుకుని ఆ భారాన్ని నెత్తికెత్తుకుని పూర్తిచేసిన ఆత్మీయ మిత్రులు, TLCA శ్రేయోభిలాషులు హరిశoకర్ రసపుత్ర గారికి మరియు నెహ్రూ కటారు గారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. అలాగే తమ రచనలు పంపి ఆదరించిన కథకులకు, ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని వెచ్చించిన న్యాయ నిర్ణేతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సుమంత్ రాంశెట్టి
అద్యక్షులు TLCA








