TLCA: స్టార్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ తో టీఎల్‌సీఏ దీపావళి డ్యాన్స్ షో

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్‌తో (Satya Master) దీపావళి ప్రత్యేక నృత్య కార్యక్రమాన్ని (Deepavali Dance Show) నిర్వహిస్తున్నట్లు తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (TLCA) ప్రకటించింది. 1971 నుండి న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల్లో ఎన్నో సేవలందిస్తున్న టీఎల్‌సీఏ (TLCA).. ఈ ఏడాది ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్‌తో దీపావళి స్పెషల్ డ్యాన్స్ బ్లాస్ట్ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 17 నుండి 31 వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలు తమ డ్యాన్స్ ప్రయాణాన్ని ఈ కార్యక్రమంలో ప్రారంభించవచ్చని టీఎల్‌సీఏ (TLCA) ఆహ్వానించింది.
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యనిర్వాహక కమిటీకి టీఎల్‌సీఏ (TLCA) అధ్యక్షులు సుమంత్ రామ్‌శెట్టి, ఉపాధ్యక్షురాలు మాధవి కోరుకొండ, కార్యదర్శి శ్రీనివాస్ సానిగెపల్లి, కోశాధికారి అరుంధతి అడుప నాయకత్వం వహిస్తున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఇతర ముఖ్య సభ్యులలో జాయింట్ సెక్రటరీ భగవాన్ నడింపల్లి, జాయింట్ కోశాధికారి లావణ్య అట్లూరి, ఎక్స్-అఫీషియో మాజీ అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సునీల్ చల్లాగుళ్ల, దివ్య దొమ్మరాజు, ప్రవీణ్ కర్ణం, సుధ మన్నవ, సునీత పోలెపల్లి, సిరిష తునుగుంట్ల ఉన్నారని టీఎల్‌సీఏ (TLCA) తెలిపింది..