టీఎల్‌సీఏ పిక్నిక్‌కు గెట్ రెడీ.. ఆగస్టు 18న రచ్చరచ్చే

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) పిక్నిక్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 18వ తేదీన న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లెలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ వేడుకను ఉత్సాహంగా నిర్వహించేందుకు టీఎల్‌సీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ పిక్నిక్‌లో భాగంగానే టీఎల్‌సీఏ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు కూడా బహుమతులు అందజేయనున్నారు. అలాగే పిక్నిక్‌లో మద్దిపట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఫిల్ కూడా జరగనుంది.