ప్రవాస భారతీయులకు ఓటు హక్కు!
విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఈ పోస్టల్ బ్యాలెట్ వంటి లెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ నిర్వాచన్ సదస్లో భారత్ ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారుల ( ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు.













