టిక్ టాక్ ను నిషేధించిన గూగుల్, యాపిల్
గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్ యాప్‌ను తొలగించాయి. ఈ చైనా సామాజిక మాధ్యమం ప్లాట్‌ఫారమ్‌ను తొలగించాల్సిందేనని, ఏప్రిల్ 3న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్రానికి లేఖ రాయడంతో ఈ యాప్‌ను తొలగించాయి. అశ్లీలంతో కూడిన వీడియోలు విరివిగా చలామణి అవుతున్నాయంటూ మద్రాస్ హైకోర్టు.. ఇటీవల టిక్‌టాక్ యాప్‌ను మనదేశ ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాప్‌స్టోర్స్ నుంచి గూగుల్, యాపిల్ టిక్‌టాక్‌ను తొలగించినా షేర్ఇట్ ద్వారా ఇప్పటికే వాడుతున్నావారు అది కావాల్సినవారికి షేర్ చేసే అవకాశం ఉందని టెక్‌ఏఆర్‌సీ అనే పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు ఫైసల్ కవూసా చెప్పారు.













