టిక్‌టాక్ పై త్వరలోనే నిర్ణయం : శ్వేతసౌధం
చైనాకు చెందిన టిక్‌టాక్, ఇతర యాప్‌లను అమెరికాలో నిషేధించడంపై కొన్ని వారాల వ్యవధిలోనే నిర్ణయం వెలువడుతుందని శ్వేతసౌధం ప్రకటించింది. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. నాటినుంచి అమెరికాలోనూ చైనా యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోంది. టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలతో అమెరికా భద్రతకు ముప్పుందని ఆ దేశాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ల సమాచారాన్ని సేకరించి విరోధికి అందజేసే మాధ్యమాలుగా ఇవి మారాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు, భారత్ తరహాలో అమెరికాలోనూ చైనా యాప్‌లను నిషేధించాలని 24 మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌నకు లేఖ రాశారు.













