టిక్‌టాక్ న్యాయపోరాటం
వీడియోషేరింగ్ యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ, చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ అమెరికా ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్వనిర్వాహక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసింది. ఏడాది కాలంగా అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, అభ్యంతరాలకు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నాం. వాస్తవాలను పట్టించుకోకుండా అమెరికా సర్కారు నిషేధం ఉత్తర్వులను జారీ చేసింది. మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు న్యాయపోరాటం తప్ప వేరొక మార్గం లేదు అని ఓ ప్రకటనలో బైట్‌డ్యాన్స్ పేర్కొంది.













