టిక్‌టాక్ సీఈఓ రాజీనామా
టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలో చేరిన నాలుగు నెలల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని వ్యవహారాలను అమెరికా సంస్థకే టిక్‌టాక్ అమ్మాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే కెవిన్ సంస్థ నుంచి వైదొలగినట్టు సమాచారం. సీఈఓ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ కెవిన్ టిక్‌టాక్ సిబ్బందికి ఓ లేఖ రాశారు. అందులో ‘నేను సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని మీ అందరికీ తెలియజేయాలకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఉత్తరఅమెరికాలో టిక్‌టాక్ జనరల్ మేనేజర్‌గా వెన్నెసా పప్పా.. సంస్థ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడతారని సమాచారం. సీఈఓగా కెవిన్ చేసిన సేవలకు గాను టిక్‌టాక్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.













