పరిమితులు విధిస్తే… అమెరికా కంపెనీలకే నష్టం
టెక్నాలజీ నిపుణులకు ఇచ్చే వీసాలకు సంబంధించి, దేశాల వారీగా పరిమితులు విధిస్తే, అమెరికా కంపెనీలు బలహీన పడతాయని, ఆయా నిపుణుల లభ్యత కొరవడి ఉద్యోగాల భర్తీ కష్టమవుతుందని దేశ ఐటీ పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) పేర్కొంది. 2017లో హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారతీయులకే దక్కాయంటే, వారి నైపుణ్యాల్లేనని నాస్కామ్ పేర్కొంది. ఆయా వీసాలను అధికంగా బహుళాజాతి కంపెనీలు, అమెరికా కేంద్రంగా పనిచేసే దిగ్గజ కంపెనీలు ప్రయోజితం (స్సాన్సర్) చేస్తున్నవేనని గుర్తు చేసింది.
భారతీయులకు దేశీయ ఐటీ సంస్థలు ఇచ్చిన వీసాల సంఖ్య స్వల్పమేనని సృష్టం చేసింది. స్థానికంగానే డేటా నిల్వ చేయాలంటూ విదేవీ కంపెనీలపై ఒత్తిడి తేస్తున్న దేశాలకు, హెచ్-1బీ వీసాల్లో 10-15 శాతమే జారీచేయాలనే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది అంటూ వచ్చిన వార్తలపై నాస్కామ్ స్పందించింది. అమెరికా ప్రభుత్వం నుంచి ఈ విషయమై ఏరకమైన అధికారిక ప్రకటన రాలేదని, అందువల్ల సృష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.













