నల్లజాతీయులకు డోనాల్డ్ ట్రంప్ కూతురు మద్దతు
అమెరికాలో ఆందోళన చేస్తున్న నల్లజాతీయులు శాంతించకుంటే.. వారిపై సైన్యాన్ని దింపుతానని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ మాత్రం నల్లజాతీయులకు తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ స్క్వేర్ పోస్టు చేసింది. శ్వేతజాతి పోలీసుల దురహంకారాన్ని తప్పుపడుతూ .. ట్రంప్ కూతురు తన పోస్టుకు ఓ కామెంట్ కూడా పెట్టింది. వంటరిగా మనం కొంతే సాధిస్తాం, కానీ కలిసి నడిస్తే ఎంతో సాధిస్తామన్న ఓ ట్యాగ్‌ను తన పోస్టుకు జత చేసిందామె. బ్లాకౌట్ ట్యూజ్‌డే, జస్టిస్ఫర్జార్జ్ ఫ్లాయిడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఆమె తన పోస్టులో ప్రజెంట్ చేసింది.













