టైమ్స్ జాబితాలో భారత సంతతి విద్యార్థులకు స్థానం!
టైమ్స్ పత్రిక వెలువరించిన అత్యంత ప్రభావశీలురైన యువత జాబితాలో మన తెలుగమ్మాయి, భారతీయ అమెరికన్ కావ్యవ కొప్పరపు స్థానం దక్కించుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆమె మెదడు కేన్సర్ రోగులకు అందించే చికిత్సలో సాయపడేలా ఓ కంప్యూటర్ వ్యవస్థను రూపొందించారు. విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన 25 మంది అత్యంత ప్రభావశీలురైన యువత జాబితాను టైమ్స్ విడుదల చేసింది. 2018వ సంవత్సరానికి గాను ఆ సంస్థ ఎంపిక చేసిన వారిలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులకు స్థానం దక్కింది. కావ్వ (18)తో పాటు రిషబ్ జైన్ (14), బ్రిటిష్ ఇండియాన్ అమికా జార్జి (19) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.













