అమెరికాలో భారతీయులు నిరాహార దీక్ష
టెక్సాస్లోని అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) డిటెన్షన్ సెంటర్ వద్ద ముగ్గురు భారతీయులు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తమపై బహిష్కరణను ఎత్తివేసి డిటెన్షన్ సెంటర్ నుంచి పంపించాలని, అమెరికాలో ఆశ్రయం కల్పించాలంటూ ఈ ముగ్గురూ జూలై 9న దీక్షకు పూనుకున్నారు. వారి ఆరోగ్యం క్షీణించడంతో ఈ ముగ్గరికీ ఐవీ ప్లూయిడ్స్ ఎక్కించారు. ఇమిగ్రేషన్ కోర్టులు తమ పట్ల వివక్ష చూపిస్తున్నాయని, తమపై బహిష్కరణ కేసులను తిరిగి విచారించాలని కోరినా తిరస్కరిస్తున్నాయని వారు ఆరోపించారు.













