న్యూయార్క్ సలహాబోర్డులో ముగ్గురు భారతీయులు
అమెరికాలో కరోనా వైరస్ విజృంభణకు కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్లో ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కౌమో ఏర్పాటు చేసిన వ్యూహాత్మక కమిటీలో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్ అధినేత్రి చంద్రికా టాండన్, న్యూయార్క్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ దండపాణిలకు ఈ గౌరవం లభించింది. ది న్యూయార్క్ ఫార్మార్డ్ రీ ఓపెనింగ్ అడ్వయిజరీ బోర్డు పేరుతో ఏర్పాటు చేసిన ఈ సలహా మండలిలో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు.













