టైమ్ మ్యాగజిన్ జాబితాలో భారతీయ అమెరికన్లు
అమెరికా ఆరోగ్య రక్షణ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ దీనిని రూపొందించింది. ఈ జాబితాలో దివ్యా నాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండే ఉన్నారు.
దివ్యా నాగ్ : వైద్యులు, పరిశోధకులకు ఉపయోగపడేలా యాపిల్ వాచ్ సీరీస్-4లో యాప్ను సిద్ధం చేశారు.
రాజ్ పంజాబీ : వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు శిక్షణను అందించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు.
గవాండే : పాదర్శకంగా, తక్కువ వ్యయంతో కార్పొరేట్ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి సల్పారు.













