ఐలయ్యకు యుఎస్ కాంగ్రెస్ మద్దతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు వివాదాలకు కేంద్ర బిందువైన సామాజిక స్మగ్లరు పుస్తక రచయత కంచె ఐలయ్య అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరిగింది. అరిజోనాకు చెందిన రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ హరోల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ అక్టోబర్ 12 అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభలో స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఐలయ్యను హత్య చేస్తామని బిజేపీ భాగస్వామి పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఓ హిందూ నాయకుడు వ్యాఖ్యలు చేసారని ఆయన సభలో తెలిపారు. ఈ అంశంపై ఆయన తన నాలుగు నిమిసాల ప్రసంగంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే అప్రజాస్వామిక పరిపాలనను తన కథనాలద్వారా ప్రశ్నించినందుకు ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ను హ్యత చేశారని, భావ ప్రకటనా స్వేఛ్చ, హేతువాదాన్ని ప్రచారం చేస్తున్నందుకు గోవింద్ పన్సారే, ఎమ్ఎమ్ కలబురిగి, నరేంద్ర దభోల్కర్వంటి హేతువాదులను హత్య చేసిన తరహాలోనే లంకేష్ హత్య చేశారని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ఐలయ్య, ఆయన తరహా వ్యక్తుల ప్రాణ రక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. అలాగే సామాజిక మాధ్యమాలద్వారా ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నందుకు అనేక దేశాల్లో సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.













