ఎంటెక్ విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్
బెంగళూరులోని ఐఐటీబీలో ఇంటి గ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్న ఆదిత్య పలివాల్ (22)అనే విద్యార్థికి గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి రూ.1.2 కోట్ల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్లు లేఖను పంపింది. ముంబయికి చెందిన ఆదిత్య బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తూనే గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కంప్యూటర్ భాష కోడింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వివిధ దేశాలకు చెందిరు ఆరు వేల మంది పరీక్ష రాయగా, 50 మంది చివరి అంకానికి చేరుకున్నారు. వారికి కృత్రిమ మేధస్సు, సాంకేతికత పరిశోధన అంశాలపై మరోమారు పరీక్ష నిర్వహించగా, ఆదిత్య మొదటిస్థానంలో నిలిచారు. ఈ నెల 16 నుంచి ఉద్యోగానికి హాజరవుతానని ఆదిత్య తెలిపారు. బెంగళూరులో నాకు ఆచార్యుల నుంచి లభించిన ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగానికి ఎంపికయ్యానని ఆదిత్య పేర్కొన్నారు.













