జనతా కర్ఫ్యూ స్ఫూర్తిదాయకం : అమెరికా
కోవిడ్ శృంఖలాలను ఛేదించేందుకు మోదీ సూచనల మేరకు భారత్లో జనతా కర్ఫ్యూ పాటించడం స్ఫూర్తిదాయకమని అమెరికా ప్రశంసించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చక్కగా దీన్ని అమలు చేశారని పేర్కొంది. కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం దేశ ప్రజలంతా ముందుకు రావడం అభినందనీయమని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్ వెల్స్ ట్వీట్ చేశారు. అమెరికాలో భారత రాయబారి తరన్జీత్సింగ్ సంధు అమెరికాలోని భారతీయ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వైరస్ ప్రభావంపై చర్చించారు. క్లిష్ట సమయంలో అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజల కోసం భారతీయ కంపెనీలు సమర్ధంగా పని చేస్తున్నాయని అభినందించారు.













