ఉత్తర కొరియా అధినేత ఆరోగ్యం విషమం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. కిమ్‌కు అత్యవసర చికిత్స చేసేందుకు చైనా నుంచి ఓ ఉన్నత స్థాయి వైద్య నిపుణుల బృందం హుటాహుటిన ప్యాంగ్యాంగ్కు చేరుకుంది. ఊబకాయం ఉన్న ఆయనకు హృద్రోగ, మధుమేహ సమస్యలున్నాయి. చైన్ స్మోకర్ కావడంతో ఆరోగ్యం ఒక పట్టాన కుదుటపడడం లేదు. ఈనెల 12న కిమ్‌కు కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగింది. అది జరిగాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. కిమ్ అనారోగ్యంగా ఉన్నట్లు వచ్చిన వార్తలను ఉత్తర కొరియా అధికార యంత్రాంగం ఖండించింది.













