తానా ఆధ్వర్యంలో మెడిటేషన్ విశేషాలు చెప్పనున్న శ్రీశ్రీ రవిశంకర్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘ది జర్నీ వితిన్’ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనలోకి మనం ఎలా వెళ్లాలని తెలిపే ఈ మెడిటేషన్, జ్ఞానంపై ప్రముఖ గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. మంగళవారం నాడు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు డెట్రాయిట్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం tiny.cc/journeydetroit లో చూడవచ్చు.