ATA: హైదరాబాద్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వేడుకల గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ATA వేడుకలు ఇన్ ఇండియా’ ముగింపు కార్యక్రమం (గ్రాండ్ ఫినాలే) ఈ నెల 27న నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది. రవీంద్ర భారతి వేదికగా శనివారం మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
సాంస్కృతిక ప్రదర్శనల సందడి
ఈ ముగింపు వేడుకల్లో భాగంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు.
ప్రధాన ఆకర్షణలుగా…
గురుశ్రీలత సూరి నేతృత్వంలో ప్రాణమ్య సూరి బృందం కుచిపూడి నృత్య ప్రదర్శన.
గరిణె సాయి కుమార్, గరిణె సంతోష్ కుమార్ బృందం పెరిణి నాట్యం.
తెలుగు ఇండియన్ ఐడల్ రన్నరప్ పి. జయరామ్, జీ సరిగమప రన్నరప్ దాసరి మేఘనా నాయుడు, ప్లేబ్యాక్ సింగర్ దువ్వురి శ్రీధ్రుతి, అమెరికా నుంచి విచ్చేసిన శ్రిత పెండ్యాల వంటి గాయనీ గాయకుల సంగీత విభావరి.
తెలంగాణ జానపద కళాకారుడు తిరుపతి మాట్ల బృందం ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఈ కార్యక్రమాన్ని సతీష్ రామసహాయం రెడ్డి (వేడుకల చైర్), నర్సింహా రెడ్డి ధ్యాసని, సాయి సుధిని, శారద సింగిరెడ్డి వంటి ప్రముఖులు పర్యవేక్షిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి నేతృత్వంలోని కార్యవర్గ బృందం ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రవేశం ఉచితం…
ఈ వేడుకలకు తెలుగు భాషా అభిమానులు, కళా ప్రేమికులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని, ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు ప్రకటించారు. ఇదే సందర్భంలో 2026 జులైలో అమెరికాలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ గురించి కూడా ప్రచారం నిర్వహించనున్నారు.






