TTA: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. అద్భుతంగా టీటీఏ దశాబ్ది వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ పదవ వార్షికోత్సవ వేడుకలు తెలంగాణ కళల తోరణం పేరుతో అత్యంత వైభవంగా జరిగాయి. డిసెంబర్ 25వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాల హోరు
తెలంగాణ జానపద కళల ప్రదర్శనలో భాగంగా బతుకమ్మ బోనాలు ఒగ్గు డోలు దప్పు గుస్సాడి బంజారా కొమ్ము కోయ, పోతురాజు వంటి కళారూపాలను ప్రదర్శించి తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పారు.
తెలంగాణ ధూమ్ ధామ్, పాటల విందు
రాము రాథోడ్, మధు ప్రియ, రేలారే గంగ కల్యాణ్ కీస్, అంతడుగుల నాగరాజు నేతృత్వంలో జరిగిన టీ ధూమ్ ధామ్ కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలాగే తెలంగాణ పాటకు సలాం పేరుతో జరిగిన కార్యక్రమంలో విమలక్క, దరువు ఎల్లన్న, వరంగల్ శ్రీనివాస్ వంటి ప్రముఖ గాయకులు తమ గళంతో అలరించారు.

జానపద జుగల్బందీ, నృత్య ప్రదర్శనలు
మోహన భోగరాజు, మౌనిక యాదవ్, శివనాగులు, రేలా రవి కాళశ్రీ భిక్షు నాయక్ వంటి కళాకారుల జానపద జుగల్బందీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందీప్ బృందం ప్రదర్శించిన పేరిణి నృత్య వైభవం, డాక్టర్ ప్రియాంక భార్డె బృందం ప్రదర్శించిన ఏకమ్ అర్ధనారీశ్వరం నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
సాహిత్య సమ్మేళనం
సాహిత్య ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన సాహిత్య ఫోరంలో ప్రముఖ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రచయిత్రి శ్రీమతి రమాదేవి నెల్లుట్ల పాల్గొని తెలంగాణ సాహిత్యంపై చర్చించారు.
పురస్కారాల ప్రదానం
సమాజంలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు టీటీఏ 10వ వార్షికోత్సవ అవార్డులను అందజేశారు. డాక్టర్ సునీత కృష్ణన్ ప్రత్యేక గుర్తింపు అవార్డు చుక్కా రామయ్య విద్యా రంగంలో విశిష్ట పురస్కారం కె. రాజేంద్ర కుమార్, ఐపీఎస్ రిటైర్డ్ దేశ సేవ పురస్కారం, కీర్తి జల్లి ఐఏఎస్ ప్రభుత్వ పాలనా రంగం, ఇతర ప్రముఖులకు వారి వారి రంగాలలో చేసిన కృషికి గాను అవార్డులతో గౌరవించారు.

నిర్వహణ, భవిష్యత్తు ప్రణాళికలు
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, చైర్మన్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి, సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కండి, సాంస్కృతిక కమిటీ సభ్యులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా 2026 జూలై 17 నుండి 19 వరకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ లో నిర్వహించబోయే టీటీఏ మెగా కన్వెన్షన్ కు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు. వచ్చిన అతిథులందరికీ ఉచిత ప్రవేశంతో పాటు రుచికరమైన భోజన వసతిని కూడా టీటీఏ కల్పించింది.
హాజరైన ముఖ్య అతిథులు, రాజకీయ ప్రముఖులు
వెంకయ్య నాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి (వర్చువల్‌గా తన సందేశాన్నిచ్చారు )
చామల కిరణ్, ఎంపీ, కాంగ్రెస్
జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్
మల్లారెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్
వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే, బీజేపీ
నిర్మాత దిల్ రాజు
కళాకారులు, సాహితీవేత్తలు
యాంకర్‌గా సుమ
గోరటి వెంకన్న ప్రముఖ కవి, గాయకుడు
సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ గేయ రచయిత
కాసర్ల శ్యామ్, ప్రముఖ గేయ రచయిత
మిట్టపల్లి సురేందర్, గాయకుడు, కవి
డాక్టర్ వెన్నెల గద్దర్, టీఎస్ఎస్ చైర్మన్
రమాదేవి నెల్లుట్ల, రచయిత్రి
మోహన భోగరాజు, గాయని
మధు ప్రియ, గాయని
మౌనిక యాదవ్, గాయని
రాము రాథోడ్, రాను బొంబాయ్‌కి రాను ఫేమ్
శ్రీనివాస్ గుడురు, సాహితీ కమిటీ చైర్మన్
ఇతర కళాకారులు
నృత్య రంగం: డాక్టర్ ప్రియాంక భార్డె (ఏకమ్ అర్ధనారీశ్వరం) సందీప్ బృందం (పేరిణి నృత్యం), పూజా తన్వి (కొరియోగ్రాఫర్).
జానపద గాయకులు: విమలక్క, దరువు ఎల్లన్న, వరంగల్ శ్రీనివాస్, నల్లమల మురళి, కోడారి శ్రీను, వెల్లాల వాణి, యాట సంధ్య, మౌనిక యాదవ్
అవార్డు గ్రహీతలు
డాక్టర్ సునీత కృష్ణన్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు
చుక్కా రామయ్య ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్
వడ్డేపల్లి కృష్ణ, సాహిత్య ప్రతిభ పురస్కారం
పసుమర్తి రంగా రావు, కమ్యూనిటీ సర్వీస్
కె.రాజేంద్ర కుమార్ (ఐపీఎస్) సర్వీస్ టు ది నేషన్
కీర్తి జల్లి (ఐఏఎస్) పబ్లిక్ సర్వీస్
కుమారి విహా రెడ్డి జొన్నలగడ్డ, స్పోర్ట్స్ ఎక్సలెన్స్
పి. ప్రమోద్ రెడ్డి, కల్చరల్ హెరిటేజ్ అవార్డు
రామలీల బండా, హ్యుమానిటేరియన్ సర్వీస్
అనిత చావలి, గ్రీన్ విజనరీ అవార్డు






