వేలానికి మైఖేల్ జాక్సన్ ఇల్లు!
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఎంత ఇష్టపడి అపూరూపంగా కట్టించుకున్న ఇల్లు నెవర్ ల్యాండ్ మరోసారి వేలానికి వచ్చింది. ఈ సారి దాని ధరను అత్యంత తక్కువగా రూ.220 కోట్లుగా నిర్ణయించారు. 2015లో ఇదే ఇంటిని రూ.640 కోట్లకు వేలం పెట్టగా అంత రేటు పెట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మళ్లీ ఇపుడు తక్కువ రేటుకే వేలం పెడుతున్నట్లు ప్రకటించారు. మరి ఈ సారైనా కొనేందుకు ఎవరైనా ముందుకోస్తారో లేదో చూడాలి. నెవర్ ల్యాండ్, ఇల్లు మాత్రమే కాకుండా ఓ జూ, గార్డెన్, భారీ థియేటర్లు కూడా ఉండటం, అమెరికాలో నిర్మించడం వల్ల ఇప్పటి ధరల ప్రకారం చూస్తే రూ.220 కోట్లంటే తక్కువే అనుకోవచ్చు. అమెరికాలోని శాంటా బార్బరా దగ్గర్లో 2,700 ఎకరాల్లో తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని కట్టుకున్నాడు మైఖేల్ జాక్సన్.













