TANA: తానా కాన్ఫరెన్స్‌లో ఆర్కెస్ట్రా అందించిన ‘చంటి’కి థాంక్స్
24వ తానా (TANA) మహాసభల్లో ప్రముఖ సింగర్స్ ఎస్పీ చరణ్, సునీత, ఆర్పీ పట్నాయక్, సింహా వంటి వారు తమ పాటలతో అందర్నీ అలరించారు. డెట్రాయిట్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సుమారు 8 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగర్స్‌కు సహకారంగా అద్భుతమైన ఆర్కెస్ట్రా అందించిన ‘చంటి ఫ్రం డల్లాస్’ టీంను తానా ప్రత్యేకంగా అభినందించింది. మూడు రోజుల పాటు జరుగుతున్న 24వ తానా కాన్ఫరెన్స్‌లో తొలి రోజున ఆర్పీ పట్నాయక్ తన మధుర గీతాలతో అలరించారు. రెండో రోజున ఎస్పీ చరణ్, సునీత తమ గానలహరిలో ప్రేక్షకులను ముంచెత్తారు. ఈ సందర్భంగా వారికి కూడా తానా ధన్యవాదాలు తెలియజేసింది.







