తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ

అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 23న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ టోర్నీ జరుగుతుంది. న్యూజెర్సీలోని బ్రాంచ్‌బర్గ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే టీం 200 డాలర్ల ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 19. రిజిస్ట్రేషన్ తదితర వివరాల కోసం http://www.tfasnj.org లో చూడవచ్చు.