తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ.. మీరు రెడీనా?

యువతలో ఉత్సాహం నింపేందుకు తెలుగు కళా సమితి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ) ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14వ తేదీ ఉదయం 8 గంటలకు న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లె టౌన్‌షిప్‌లో అవుట్‌డోర్ వాలీబాల్ కోర్ట్స్‌లో ఈ టోర్నీ మొదలవుతుంది. ఈ పోటీల్లో పాల్గొనాలుకునే జట్లు 100 డాలర్ల ఫీజు చెల్లించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టోర్నీలో విన్నర్‌లతోపాటు రన్నరప్‌లకు కూడా మంచి క్యాష్ ప్రైజులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకున్నా, అలాగే దీని గురించి మరింత సమాచారం కావాలన్నా http://www.tfasnj.org లింకులో చూడవచ్చు.