న్యూజెర్సీ వేదికగా టీఎఫ్ఏఎస్ టెన్నిస్ పోటీలు

అమెరికాలోని తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) 40వ వసంత వేడుకలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ టెన్నిస్ కోర్ట్స్ వేదికగా ఈ నెల 26, 27 తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. బాయ్స్, గర్ల్స్, సీనియర్స్, జూనియర్స్ విభాగాలతోపాటు 55 ఏళ్లపైబడిన వారి కోసం సీనియర్ డబుల్స్ విభాగంలో క కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలకునే వారు బుధవారం లోగా http://www.tfasnj.org లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.