తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీ వేదికగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి 17 వరకు వారాంతాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీ విజేతలకు వెయ్యి డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. రెండో స్థానంలో నిలిచిన వారికి 500 డాలర్లు అందజేస్తారు. ఈ టోర్నమెంట్‌లో తలపడాలని అనుకునే జట్టు 200 డాలర్ల ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ 40 వసంతాల వేడుకల్లో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనాలని అనుకునే వారు http://www.tfasnj.org లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://tinyurl.com/TFAS40CricketTournament లో సంప్రదించవచ్చు.