రూ.206 పెట్టుబడితో… రూ.10 కోట్లు లాభం
అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. తిండికి గతిలేని వాడు కూడా అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమెరికాలో ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. చాలా మంది వ్యాపారులు కోట్లలో పెట్టుబడి పెట్టి సంవత్సరాలు కష్టపడినా పెద్దగా లాభాలు సంపాదించలేరు. టెక్సాస్‌కు చెందిన ఈ యువకుడు మాత్రం రూ.206 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రి రూ.10 కోట్లు సంపాదించాడు. అయితే యువకుడు ఏం వ్యాపారం చేయలేదు.
టెక్సాస్‌లోని లక్కీ ఈగల్ కేసినో హోటల్లో యూ స్పిన్ జాక్స్పాట్ స్పిన్ మిషన్‌పై పందెం కాశాడు. ఎప్పుడో ఒకరిని వరించే ఈ జాక్‌పాట్ ఈసారి టెక్సాస్‌లోని ఈగల్ పాస్ ప్రాంతానికి చెందిన యువకుడిని వరించింది. హోటల్లో ప్లాటినమ్ ప్లేయర్స్ క్లబ్లో మెంబర్‌గా ఉన్న యువకుడు స్నేహితుడితో కలిసి కేసినోకు వచ్చాడు. మూడు డాలర్లు (రూ.206) పందెం పెట్టగా..15 లక్షల 48 వేల డాలర్ల (రూ.10 కోట్ల 64 లక్షలు) జాక్‌పాట్ యువకుడిని వరించింది. దీంతో యువకుడి ఆనందానికి అవధుల్లేవు.
కేసినో పందెంలో రాత్రికి రాత్రే కోట్లు పోగొట్టుకున్న వాళ్లు కూడా అనేక మంది ఉన్నారు. అందుకే అంటారు అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పిపోదు అని. కాగా, పది లక్షల డాలర్లకు పైగా జాక్‌పాట్ తగలడం గత 8 ఏళ్లలో ఇది పదోసారి అని కేసినో సిబ్బంది చెబుతోంది.













