క్యూబా రాయబార కార్యాలయంపై కాల్పులు
అమెరికాలోని క్యూబా రాయబార కార్యాలయంపై పలువురు దుండగులు శుక్రవారం తెల్లవారు జామున ఉదయం 2 గంటల సమయంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనీ, కార్యాలయం కొద్దిగా ధ్వంసమయిందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో కాల్పుల శబ్దం విన్న సమీపంలోని స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి 42 ఏండ్లు అనీ, ఆయన టెక్సాస్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణం ఇంకా తెలియలేదనీ.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.













