త్వరలో స్టీఫెన్స్ లవ్ పెళ్లి
అమెరికా టెన్నిస్ స్టార్ స్లోన్ స్టీఫెన్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న అమెరికా పుట్‌బాల్ ఆటగాడు జోజీ అల్టిడోర్తో స్టీఫెన్స్ ఎంగేజ్మెంట్ జరిగింది. అతనితో నిశ్చితార్థం జరిగినట్టు ట్విటర్ ద్వారా ప్రకటించింది. జోజీతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. 2017లో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన 26 ఏళ్ల స్టీఫెన్స్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచింది. అమెరికా జట్టు తరపున రెండు సార్లు సాకర్ ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించిన 29 ఏళ్ల జోజీ అల్టిడోర్ ప్రస్తుతం టొరంటో ఎఫ్‌సీ క్లబ్ తరపున ఆడుతున్నాడు.













