అమెరికా మహిళ గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే
అమెరికాకు చెందిన 58 ఏళ్ల మహిళ తామి మానిస్ ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. నాక్స్ విల్లేకు చెందిన ఈమెకు 172.72 సె.మీ. (5.8 అడుగుల) పొడవైన జుట్టు ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. టెన్నెసే రాష్ట్రంలోని నాక్స్ విల్లేకు చెందిన మానిస్ ప్రభుత్వ నర్సుగా పని చేస్తున్నారు. ఆమెరికన్ రాక్బ్యాండ్లో ఓ వీడియో చూసి ప్రేరణ పొందిన ఆమె 1980 నుంచి తన జుట్టును ఒక్కసారి కూడా కత్తిరించుకోలేదట. తల ముందు భాగాన్ని మాత్రం హెయిర్ స్టయిల్ చేయిస్తూ వెనుక వైపు పొడవుగా పెంచారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కురుల సంరక్షణకు హస్క్ హెయిర్ ఉత్పత్తులను వాడినట్లు మానిస్ తెలిపారు.













