ఆటా కాన్ఫరెన్స్ కి తెలుగు టైమ్స్ మద్దతు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షులు శ్రీ భువనేశ్ భుజాల ప్రస్తుతం ఇండియా వచ్చిన సంగతి, గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని, ఇతరులను, హైదరాబాద్ లో మెగా స్టార్ చిరంజీవి గారిని కలిసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే!.
శ్రీ భువనేశ్ భుజాల ఈ రోజు తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ చెన్నూరి వెంకట సుబ్బా రావుని ఆయన స్వగృహంలో కలిసి అనేక విషయలు చర్చించారు. శ్రీ భువనేశ్ రాకను అభినందిస్తూ 1992 లో ఆటా సంస్థ జరిపిన మొట్ట మొదటి తెలుగు మహ సభల నుంచి ఆటా తో తన అనుబంధాన్ని శ్రీ సుబ్బా రావు గుర్తు చేసు కొన్నారు. 2003 నుంచి ప్రతి కాన్ఫరెన్స్ లో ప్రత్యేక్షం గా పాల్గొంటున్న శ్రీ సుబ్బారావు అనుభవాలను శ్రీ భువనేశ్ తెలుసుకొన్నారు. వాషింగ్టన్ డి సీ లో జులై 1-3, 2022లో జరగబోయే ఆటామహా సభల నిర్వాహణ లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు, కాన్ఫరెన్స్ విజయ వంతం గా నిర్వహించేందుకు ఇలాంటి అనుభవ పూర్వకమైన విషయాలు చాల ఉపయోగపడతాయని, అందుకనే తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు ని కలిశానని శ్రీ భువనేశ్ తెలిపారు.
కోవిడ్ సంక్షోభం వలన 2020, 2021 లలో జరగాల్సిన తెలుగు మహా సభలు జరగలేదని, 2022 జులై లో జరిగే ఆటా మహా సభల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, వారి కోసం ఆటా కుటుంబం మొత్తం పనిచేసి ఒక గొప్ప అనుభూతి ని ఇవ్వాలన్నదే తమ ద్యేయం అని శ్రీ భువనేశ్ తెలిపారు. ఈ మహాసభలకు తెలుగు టైమ్స్ కేవలం మీడియా పార్టనర్ గానే కాకుండా మార్కెటింగ్ పార్టనర్ గా కూడా పని చేయాలని, తెలుగు రాష్ట్రాల నుంచి రియల్ ఎస్టేట్, జూవెల్లరీ, క్లోత్ బిసినెస్ వారికి వ్యాపార పరంగా ఆకర్షణీయమైన ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని శ్రీ భువనేశ్ తెలిపారు. తెలుగు టైమ్స్ 2003 నుంచి అమెరికా లో జరిగే తెలుగు మహా సభలలో పాల్గొంటూ ఉందని, ఇప్పుడు రాబోయే ఆటా మహా సభ లకు తప్పకుండా పూర్తి మద్దతు ఇస్తుందని శ్రీ సుబ్బారావు తెలిపారు. డిసెంబర్ 2021 లో తెలుగు రాష్ట్రాలలో జరిగే ఆటా వేడుకలకు, 2022 జులైలో వాషింగ్టన్ లో జరిగే ఆటా సభల నిర్వాహణ తో పాటు అనేక కార్యక్రమాలు రూపొందించిన ఆటా అధ్యక్షులు శ్రీ భువనేశ్ భుజాల ను శ్రీ సుబ్బారావు అభినందించారు.













