NATS: మోహన్ కృష్ణ మన్నవ విడుదల చేసిన తెలుగు టైమ్స్ – నాట్స్ సంబరాలు ప్రత్యేక సంచిక
టాంపా నగరం లో అంగరంగ వైభవం గా జరుగుతున్న నాట్స్ (NATS) 8 వ తెలుగు సంబరాలు వేడుక కోసం తెలుగు టైమ్స్ ఒక ప్రత్యేక సంచిక ను తయారు చేసింది.
అమెరికా లో తెలుగు వారందరికీ పరిచయం అవసరం లేని, నాట్స్ పూర్వ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లో AP Technology Services (APTS) చైర్మన్, శ్రీ మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ సంబరాలలో మీడియా సెంటర్ లో జరిగిన వేడుక లో తెలుగు టైమ్స్ – నాట్స్ తెలుగు సంబరాల ప్రత్యేక సంచిక ను విడుదల చేశారు.
ఈ సందర్భం గా శ్రీ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగు టైమ్స్ అమెరికా లో తెలుగు కమ్యూనిటీ 22 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తోందని, ముఖ్యంగా తెలుగు సంఘాల కార్య క్రమాలను ఎప్పటికప్పుడు కమ్యూనిటీ కి అందిస్తోందని, ఇప్పుడు నాట్స్ సంబరాలు కి కూడా తెలుగు టైమ్స్ తెచ్చిన ప్రత్యేక సంచిక చాలా బావుందని అభినందించారు. ఈసందర్భ లోనే ఆయన ఎన్ ఆర్ ఐ లకు ఆంధ్ర రాష్ట్ర పభుత్వం కూడా సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉందని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ( APTS ) సంస్థ కి నన్ను చైర్మన్ చేయటం వలన నేను కూడా APTS ద్వారా కూడా సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ప్రత్యేక సంచిక విడుదల చేసిన సందర్భంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ & పబ్లిషర్ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ తెలుగు టైమ్స్ ప్రతి సంవత్సరం జరిగే తెలుగు కాన్ఫరెన్స్ లకు ప్రత్యేక సంచికలు తీసుకొస్తుందని, వాటిని అందరిని అలరిస్తున్నాయి అని, నాట్స్ సంచిక కూడా అందరి మన్ననలు పొందుతుందని అనుకుంటున్నానని, సంచిక విడుదల చేసిన శ్రీ మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ విజయ్ కట్టా, చైర్ – మీడియా కమిటీ కి, నాట్స్ సంస్థ కి ధన్యవాదాలు తెలిపారు.







