అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కానరాని లోకాలకు వెళ్లాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన రెడ్డి మాలతి, రెడ్డి రాజం దంపతుల చిన్న కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్ (27) ఎంఎస్ చదివేందుకు 2014వ సంవత్సరంలో యూఎస్ఏ వెళ్లాడు. క్యాంప్లిసేవీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అమెరికాలోని రిచ్మండ్లో నివాసముంటూ ఉద్యోగం సైతం చేస్తున్నాడు. ఆదివారం ఈస్టర్ వేడుకల సందర్భంగా శ్రావణ్‌కుమార్ స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీచ్‌లో నడుచుకుంటూ వస్తుండగా అలలు రావడంతో శ్రావణ్‌కుమార్ గల్లంతయ్యాడు. గమనించిన అతని స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అదించారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. ఈ సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు చేరవేశారు. రెడ్డి రాజం, మాలతి దంపతులకు నలుగురు కుమారులు కాగా… మూడో కుమారుడు క్రాంతి అమెరికాలోనే విద్యాభ్యాసం కొనసాగించి ఇటీవలే స్వదేశానికి వచ్చాడు.













