TSN: నెబ్రాస్కా తెలుగు సమితి కొత్త చరిత్ర…యువజన సదస్సు విజయవంతం
నెబ్రాస్కా తెలుగు సమితి (TSN) తన మొట్టమొదటి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. 7వ తరగతి నుండి కాలేజీ విద్యార్థుల వరకు సుమారు అనేకమంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు, మెంటార్షిప్ మరియు సాంస్కృతిక అనుబంధానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన యువ నిపుణులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థులు తమ భారతీయ అమెరికన్ మూలాలను మర్చిపోకుండానే, విద్య మరియు వృత్తిపరమైన రంగాల్లో ఎలా రాణించాలనే అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించింది.
టి ఎస్ ఎన్ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘కలిసి ఉండండి, మీ మూలాలను మర్చిపోకండి, అప్పుడు మీరు ఎప్పుడూ ఒంటరి వారు కారు’’ అన్న ఈ వేడుక ఉద్దేశ్యాన్ని చాటి చెప్పారు.






