Telugu Professor honored for outstanding achievements
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త – శ్రీ సూర్యనారాయణ చల్లపల్లి
అద్భుతాలు ఎక్కడో జరగవు , మన మధ్యనే మనతో పాటూ ఉండే మనవారి ద్వారానే జరుగుతాయి.
అలాంటి అద్భుతమే ఈ మధ్య జరిగింది. ఒర్లాండో తెలుగు వారందరికీ సుపరిచితులైన శ్రీ చల్లపల్లి సూర్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఒర్లాండో లేరు. వారిని ప్రపంచంలోని పదార్ధ శాస్త్రము (Materials Science) విభాగము లో మేటి శాస్త్రవేత్తగా Stanford university వారు గుర్తిస్తూ శ్లాఘించటం తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామం.
ఇంత ఉన్నతశిఖరాలకు చేరుకుని మరెన్నో పదవులు కీర్తులు కలిగిన మన చల్లపల్లి వారు ఎంత మృదుస్వాభావులో , ఎత్తుకెదిగినా ఎంత ఒదిగిఉంటారో మనందరికీ విదితమే..
ఈనాటి వారి విజయం మనందరికీ స్ఫూర్తికావాలని ఒర్లాండో మహానగర తెలుగు సంఘం కోరుకుంటోంది













