ఐరాస సమ్మేళనంలో పరిశీలకుడిగా తెలుగు అధికారి
తెలుగువాడైన ఐఆర్ఎస్ అధికారి నేలపట్ల అశోక్‌బాబు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లో నేటి నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న బుద్ధ జయంతి సమ్మేళనంలో పరిశీలకుడిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మానవాళి అభివృద్ధి- బౌద్ధమతం పాత్ర అనే అంశంపై ప్రసంగిస్తారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్, థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంకో ఆ దేశపు ప్రధాని ప్రాయుత్ చానోచానులతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అశోక్‌బాబు ప్రస్తుతం ముంబయిలో ఆదాయపు పన్నుశాఖ సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు.













