తెలుగుభాషకు పట్టం కట్టిన అమెరికా సాహితీ సదస్సు
వంగూరి ఫౌండేషన్, సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియా (అమెరికా)లో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు నుంచి రచయిత్రులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సాహితీ సదస్సు తెలుగుభాషకు పట్టం కట్టింది. సభా కార్యక్రమంలో సాహితీవేత్తలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ వంగూరి సంస్థ అధినేత, రచయిత చిట్టెన్రాజు సాహితీరంగానికి చేస్తున్న సేవను అభినందించారు. సాహితీవేత్తలు ఆనంద్ కూచిభొట్ల, మృణాళిని, కలవెండి ఫౌండేషన్ ప్రతినిధి కెఎస్ మూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వంగూరి చిట్టెన్రాజు, కూచిబొట్ల ఆనంద్‌ను సత్కరించారు.













