అమెరికాలో అవయవ దానం చేసిన తెలుగు దంపతులు
పద్నాలుగేళ్ల కొడుకు ఆకస్మాత్తుగా చనిపోతే, ఆ కుంటుంబం ఎంత విలవిల్లాడుతుందో అందరికీ తెలుసు. అయితే అంత బాధలోనూ నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో అవయవదానానికి అంగీకరించడం నిజంగా గొప్ప విషయం. అమెరికాలో స్థిరపడిన తెలుగు దంపతులు కూడా బ్రెయిడ్ డెడ్ అయి చనిపోయిన తమ కొడుకు అవయవాలను దానమిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జనరల్ ఇన్సూరెన్స్ సర్వేయర్ పిన్నింటి వెంకటేశ్వర్లు (బాలాజీ వెంకటేశ్వర్లు), రత్తమ్మల కుమారుడు పిన్నింటి సురేష్‌బాబు, కోడలు సుధ ఇద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. సురేష్ బాబు, సుధ దంపతులకు కుమార్తె రమ్య, చిలకలూరిపేటలోని తాతాయ్య ఇంట్లో పెరిగాడు. ప్రస్తుతం అమెరికాలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 9న కిరణ్‌కు బ్రెయిన్ స్రోక్ట్ రావడంతో తల్లిదండ్రులు అక్కడి ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడిన కరణ్ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. అవయవదానంతో సుమారు 10 మందికి సహాయపడే అవకాశం ఉండడంతో కరణ్ తల్లిదండ్రులు ఇంత బాధలోనూ అందుకు అంగీకరించారు. అవయవ సేకరణ అనంతరం వైద్యులు కరణ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.













