మిన్నియాపోలిస్ లో తానా తెలుగు ఆట-పాట
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో తెలుగు పిల్లల ఆట-పాట ఘనంగా జరిగింది. తానా నార్త్ సెంట్రల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమములో 125 మందికి పైగా తెలుగు వారు పాల్గొని సరదా సరదాగా గడిపారు. మిస్ టైనీ మిన్నెసొటా ఎర్త్‌గా సెలెక్ట్ అయిన జాన్వీని, పజిల్ సాల్వింగ్‌లో అద్భుత ప్రతిభ కనపరుస్తున్న రయిరత్ పేటేటిని అందరి సమక్షంలో అభినందనలు తెలియజేశారు. తానా నార్త్ సెంట్రల్ టీం తెలుగు పిల్లలు ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటూ వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహింది.
తానా పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకుంటూ తమ మొదటి సంవత్సరం విజయవంతముగా పూర్తి చేసిన కొంతమంది విద్యార్థులకు పాఠశాల సర్టిఫికెట్లను, మెడల్స్‌ను అందచేయటం జరిగింది..
ఆట పాటలలో ఉత్సాహముగా పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసలు, మెడల్స్ అందచేయటం జరిగింది.. ఈ కార్యక్రమంలో తానా తరుపున రీజినల్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని, మినియాపొలిస్ టీమ్ స్క్వేర్ చైర్ రామ్ వంకిన , యూత్ లీడర్షిప్ ప్రమోషన్ చైర్ వెంకట్ జువ్వ, తానా కేర్స్ చైర్ వేదవ్యాస్ అర్వపల్లి, పాఠశాల ఏరియా చైర్ నాగరాజు మాలెంపాటి, పాఠశాల కో చైర్ సురేష్ బొర్రా తదితరులు పాల్గొన్నారు.













