అంతర్జాల వేదికపైన ఆగస్టు 28,29 తేదీల్లో తెలుగు భాషా దినోత్సవం – 2021

తెలుగు లో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలు, వీధి అరుగు నార్వే మరియు సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ వారు ప్రపంచంలోని 55 కి పైగా తెలుగు సమాఖ్యల సౌజన్యముతో ‘‘తెలుగు భాషా దినోత్సవం – 2021’’ ను ఈ సంవత్సరం ఆగస్టు 28, 29 తేదీలలో అంతర్జాలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగం గా సమాచార పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్-19 వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి కొంతవరకు ప్రోత్సాహం అందించాలని నిర్వాహకుల ఆలోచన. ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందజేస్తున్న పప్రంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలవారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం సమర్పకులకు హ•దయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు.