టీఏఎస్సీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ‘వనభోజనాలు’
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో ప్రకృతి ఒడిలో సేదతీరడంతోపాటు జీవితంలో ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ‘వనభోజనాలు’ కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే పద్ధతిని అనుసరిస్తూ దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టీఏఎస్సీ) కూడా వనభోజనాలు నిర్వహించింది. కమ్యూనిటీ సభ్యులంతా కలిసి కార్బన్ కాన్యన్ రీజనల్ పార్క్లో ఈ వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ టీఏఎస్సీ దన్యవాదాలు తెలిపింది. దీనిలో భాగంగా అక్కడే వంటలు చేయడంతోపాటు ప్రత్యేకంగా దోశ స్టేషన్ ఏర్పాటు చేశారు. చిన్నారులంతా లెమన్ స్పూన్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటపాటలతో సరదాగా గడిపారు. అదే సమయంలో పెద్దవాళ్లంతా దీపారధన, విష్ణు సహస్రనామాల పఠనంతో భక్తిపారవశ్యంలో సమయం గడిపారు.













