బోస్టన్ వేదికగా దీపావళి ధమాకా వేడుకలు

అమెరికాలోని బోస్టన్ లో తెలుగు దీపావళి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టీయేజీబీ) ఆధ్వర్యంలో దీపావళి ధమాకా కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కీఫ్ రీజనల్ టెక్నికల్ స్కూల్ వేదికగా దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో కల్చరల్ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉన్నవారు https://tagb.org/event-details.php?id=156 లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.