NATS: నాట్స్ కాన్ఫరెన్స్‌లో బుల్లితెర నటులకు సన్మానం
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల వేదికపై బుల్లితెర నటులు రాకేష్, సుజాత, రజిత, ప్రియ, రీతూ, అవినాష్, ఆషు రెడ్డి, నటరాజ్ మాస్టర్, నీతూలకు సత్కారం జరిగింది. ప్రతిఇంట్లో కుటుంబ సభ్యుల్లా మారిన ఈ బుల్లితెర నటులను నాట్స్ ఇలా గౌరవించింది. వీరిలో పలువురు తమ కామెడీతో తెలుగు కుటుంబాల్లో నవ్వులు పూయిస్తుంటే.. మరికొందరు తమ నటనతో మెప్పిస్తున్నారు. తమను ఇలా సత్కరించిన నాట్స్‌కు వీరంతా ధన్యవాదాలు తెలియజేశారు.







